
మొపాల్ మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు 8వ రోజు దీక్ష చేపట్టడం జరిగింది కనీసం వినాయక చవితి సందర్భంగా కూడా తాము ఇంట్లో ఉండకుండా ప్రభుత్వం మమ్మల్ని రోడ్డుకి ఇచ్చిందని, మా పిల్లల్ని తీసుకొచ్చి మరీ ఇక్కడ ఉండడం మాకు బాధాకరంగా ఉందని ఇప్పటికైనా అమ్మ బాధను అర్థం చేసుకొని మా కుటుంబాల్లో వెలుగు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఆ వినాయకుడు లాగా కేసీఆర్ ని కూడా కొలుస్తామని మా జీవితంలో ఆయన వెలుగులు నింపాలని 26 వేల జీతంతో పాటు తమ పింఛన్ సదుపాయం కల్పించాలని కోరారు. అందరూ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో పండుగలో పాల్గొంటే మేము మాత్రం మండుటెండలో ధర్నా చేసే దౌర్భాగ్యస్థితిలో ఉన్నామని వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి రజిత సుమలత రాణి తదితరులు పాల్గొన్నారు