
మండల పరిధిలోని గురుకుంట అంగన్వాడీ టీచర్లు చిన్నారులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆ గ్రామ యువత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం వారు ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడ ఉన్న వంటి సరుకులను పరిశీలించి చూస్తే ఎక్సపైర్ డేట్ ఐపోయిన కారం పొడి, చింతపండు వేసి వంటలు చేసి పిల్లకి పెడుతున్నారు అని చూసి చలించి పోయారు. తమ పిల్లలకు ఇలా నాణ్యత లేని సరుకులతో భోజనాలు పెడుతున్నారు అని అక్కడ అంగన్వాడీ సెంటర్ టీచర్లు సరళ, బందమ్మ లపై విరుచుకుపడ్డారు. చిన్న పిల్లలకి ఏమైనా ఐతే ఎవరిది బాధ్యత అని హెచ్చరించారు. ఈ విషయంపై ఐసీడీఎస్ సూపర్ వైజర్ రత్నమాల ను వివరణ కోరగా అక్కడ వెళ్లి పరిశీలించి చూసి సంబంధించిన అంగన్వాడీ టీచర్ల పని విదానాన్ని, రికార్డులను చూసి ఏమైనా అవకతవకలు జరిగినట్లు తెలుస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత మూడు రోజుల క్రితం ఓ చిన్నారి తలకు బలమైన గాయమైంది అని ఆ తల్లి తండ్రి కూడా సూపర్ వైజర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యంగా జరిగింది అని అంటున్నారు. గత మూడు నెలల క్రితం కూడా కుళ్ళిన గుడ్డు చిన్నారులకు ఇచ్చారని అప్పుడు కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆ చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. అంగన్వాడీ టీచర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదు అని స్థానికులు చెబుతున్నారు.సంబందించిన అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.