చిన్నారుల చదువుపై అంగన్వాడి టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: రసూల్

నవతెలంగాణ – ఆర్మూర్
అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డి డబ్ల్యూ ఓ రసూల్ బి అన్నారు. పట్టణంలోని అంగన్వాడి టీచర్లకు ఈసీసీఈ శిక్షణ తరగతులలో భాగంగా గురువారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు పునాది దశ అని, మనము వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అంగన్వాడి కేంద్రాల్లోనూ ఇంటి వద్ద అందించాలని, ఈ దశలో పిల్లలకు తయారు చేస్తే భవిష్యత్తులో వారు పౌరులుగా తయారవుతారని అన్నారు. అంగన్వాడి సెంటర్లలో హాజరు శాతాన్ని పెంచాలని, నూతన జాతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పులు, సవరించిన అంశాలను టీచర్లకు వివరించినారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సిడిపిఓ జ్యోతి, మాస్టర్ ట్రైనర్స్ రేఖ, శ్రీదేవి సూపర్వైజర్లు వెంకట రమణమ్మ ,నలిని ,అనురాధ తదితరులు పాల్గొన్నారు.