కళ్లకు గంతలు కట్టుకొని అంగన్వాడీల నిరసన

నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
ఆలేరు పట్టణంలో ఆదివారం తాసిల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. అంగన్వాడీలకు సీఎం కేసీఆర్‌ రూ.26 వేల నెల జీతం ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సి తో కలపాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జలపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మోరిగాడి. రమేష్‌ ,సిఐటియు మండల కార్యదర్శి సంఘీ. రాజు , అంగన్వాడి ఉద్యోగ నాయకులు పద్మ, రమ, లక్ష్మి, మంజుల, మనోరమ, అనూష, సరిత, భారతి, నవీన, రేణుక, రత్న, బాలమణి, పుష్పలత, అరుణ పాల్గొన్నారు.
భువనగిరిరూరల్‌: అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కష్ణ, పట్టణ కార్యదర్శి గందమల్ల మాతయ్యలు అన్నారు. ఆదివారం వారు అంగన్వాడీ సమ్మె శిభిరాన్ని సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాకుమారి, మండలం, పట్టణానికి సంబంధించిన అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
రాజాపేట: మండల కేంద్రంలోని తాసిల్దార్‌ ఆఫీస్‌ ముందు అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ చేస్తున్న సమ్మెలో భాగంగా ఆదివారం నామకరణ మహౌత్సవంతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు స్వప్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, రజిత, గిరెడ్డి పద్మ, నిర్మల, స్వప్న భూలక్ష్మి, భవాని శోభ తదితరులు పాల్గొన్నారు.