– సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
నవతెలంగాణ -యాదగిరిగుట్టరూరల్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూటీ అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో జరుగుతున్న 9వ రోజు అంగన్వాడీలు బతుకమ్మలతో ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్‌కు గ్రాట్యుటీ అమలు చేయాలని తీర్పునిచ్చిందన్నారు. తక్షణమే ఇచ్చిన తీర్పు ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బేఖారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు స్థానిక ప్రీమియర్ ఎక్స్ ప్లోసివ్స్ యూనియన్ సీఐటీయూ తరుపున మద్దతు తెలియజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బురు సత్యనారాయణ, ప్రీమియర్ యూనియన్ కార్యదర్శి పుప్పాల గణేష్, నాయకులు నగేష్, వెంకటేష్ మద్దతు తెలియజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు శోభ, నాయకురాలు గుడ్ల సునీత, కుసుమ కళ్యాణి, రమాదేవి, సరిత, సునీత, లలిత, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు మొరిగాడి రమేష్ కోరారు. మంగళవారం పట్టణకేంద్రంలోని చౌరస్తాలో అంగన్‌వాడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రైల్వే గేట్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం దీక్షా కేంద్రం వరకు బోనాలు ఎత్తుకొని ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. సోమవారం చవితి పండగ సందర్భంగా చిన్నారులతో కలిసి దీక్షా శిబిరం వద్ద గణనాధుని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు, ఎంఏ. ఇక్బాల్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, జూకంటి. పౌలు రైతు సంఘం నాయకులు ఘనగాని.మల్లేశం, అంగన్వాడీ టీచర్లు గంగుల రామ, లక్ష్మి, మంజుల, శారద, సంపూర్ణ , ఉపేంద్ర , సరిత ,లక్ష్మి , విజయ తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు 9వ రోజు సమ్మె సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొక్కొండ లింగయ్య సిఐటియు మండల కన్వీనర్ తూటి వెంకటేశం వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తలారి మాతయ్య సిఐటియు నాయకులు గడ్డమీది నరసింహ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జ్యోతి శ్యామల పి సునీత స్వరూప కే సుజిత లావణ్య రజిని భాగ్య స్వప్న క్రాంతి జ్ఞానేశ్వరి పరమేశ్వరి బాలమణి రమ్య అనిత తదితరులు పాల్గొన్నారు
చౌటుప్పల్‌రూరల్:స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు అంగన్వాడీ కార్మికుల ధర్నా మంగళవారంతో తొమ్మిది రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.పాషా మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రామన్నపేట : అంగన్ వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని అంగన్ వాడీ టీచర్, హెల్పర్స్ మండల గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు గొరిగె సోములు కోరారు. మండల కేంద్రంలో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆద్వర్యంలో మంగళవారం బోనాలతో ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు నాయకులు వేముల సైదులు, గంటెపాక శివ కుమార్, ఆ యూనియన్ మండల అధ్యక్ష,కార్యదర్శులు బాదే మంజుల, గట్టు లళిత, నాయకురాలు సమత, స్వరూప, బద్రున్నిసబేగం, కవిత, శోభ, వసంత, సుశీల, అనిత, నాగమణి, ధనమ్మ, పూలమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాజాపేట: అంగన్వాడీ టీచర్లు ,సహాయకులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన 9వ రోజుకి చేరిన నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన దీక్ష శిబిరానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ మద్దతు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బూరుగు సప్న, అంగన్వాడీ నేతలు భాగ్యలక్ష్మి, భూలక్ష్మి, బాలలక్ష్మి, శోభ, రజిత, తదితరులు పాల్గొన్నారు.