– సీఐటీయూ జిల్లా కార్యదర్శి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు ,జిల్లా అధ్యక్షులు శారద
నవతెలంగాణ – వనపర్తి
అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు ,జిల్లా అధ్యక్షులు శారద, జిల్లా కార్యదర్శి నారాయణమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు కవిత అన్నారు.12న తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టర్ కార్యాలయం ముందు 1000 మందితో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలని నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. పనిచేయని ఫోన్ల ద్వారా పనులు చేయించరాదన్నారు. పనిచేయని సెల్ ఫోన్లు మీకు అందజేస్తామని అన్‌లైన్ పని కోసం ఫైవ్ జి డేటా టెక్నాలజీ తో కొత్త ల్యాప్టాప్ లు ఇవ్వాలని అన్‌లైన్లో పనికి వేతనాలకు పెట్టే షరతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒకపూట బడి, మే నెల అంతా టీచర్స్ హెల్పర్స్ కు ఇద్దరికీ ఒకేసారి వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. 24 రోజుల సమ్మె కాలం వేతనాలు తక్షణమే చెల్లించాలని ప్రతి నెల ఒకటో తేదీన టీచర్స్ కు హెల్పర్స్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలు పెంచాలని కోరారు. అనంరతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏం. రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, సహాయ కార్యదర్శి ఆర్. ఎన్. రమేష్, సూర్యవంశం రాము మాట్లాడుతూ పిఆర్సీ ఏరియాస్ 2021 జులై అక్టోబర్ నవంబర్ మూడు నెలల వెంటనే చెల్లించాలన్నారు. గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లకు పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. పిఎఫ్. ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రతినిధి బందం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏఒకి వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నందిమల్ల రాములు, నాయకులు మద్దిలేటి పాటలు పాడి ఉత్సాహపరిచారు. జిల్లా కోశాధికారి రాధా, యూనియన్ వనపర్తి ప్రాజెక్టు అధ్యక్షులు జ్యోతి కార్యదర్శి సుమతి యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, సంధ్యారాణి, వెంకటేశ్వరామ్మ, కవిత ,గోవిందమ్మ, సుగుణ బాయి, శారద, రామచంద్రమ్మ, అరుణ, విజయ తదితరులు మూడు ప్రాజెక్టుల నాయకులు పాల్గొన్నారు.