– అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు కె సమ్మక్క
– మండల కేంద్రంలో తొమ్మిదవ రోజు వినూత్న నిరసన
నవతెలంగాణ-తాడ్వాయి : అంగన్వాడి టీచర్లను పర్మినెంట్ చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11 నుండి ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరింది. మంగళవారం నాడు మండలంలోని అంగన్వాడి టీచర్లు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క మాట్లాడుతూ అంగన్వాడీలను వెంటనే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అందించాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్, ఈఎస్ఐ ఉద్యోగ భద్ర సౌకర్యాలు కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ప్రకారం రాష్ట్రంలోనూ అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుటీ చెల్లించాలని, రిటర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని, ని బట్టి వేతనంలో వ్యత్యాసం ఉండాలని ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షులు జమున, నాయకులు సరిత, నిర్మల, వెంకటలక్ష్మి, 85 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.