అంగన్వాడీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

Anganwadis should be paid pending wages– సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
– ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రంలో మినీ నుండి మెయిన్ అయిన 4 వేల మంది అంగన్వాడి టీచర్లకు 5 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. వీరికి పూర్తి వేతనం చెల్లించే విధంగా ఆర్థిక శాఖ ట్రెజరీలో అప్డేట్ చేయాలని అన్నారు. బుధవారం ఆదిలాబాద్ ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్పర్స్ ను నియమించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక పోరాటాల ఫలితంగా 4 వేల మంది మినీ అంగన్వాడీ టీచర ను 2024 జనవరి నుండి మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న్నారు. దీంతో 4 వేల మంది అంగన్వాడీ టీచర్స్ మా బతుకులు ఇప్పటికైనా బాగుపడే అవకాశం లభించిందని, వెట్టి చాకిరీ నుండి విముక్తి అయ్యామని, పెరిగిన వేతనం ఆర్థికంగా కుటుంబ అవసరాలకు ఎంతగానో తోడ్పడుతుందని సంతోషపడ్డారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల వీరికి నిరాశే మిగిలింది, మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ & నెలల వేతనాలు పాత పద్ధతిలో సగం వేతనాలే చెల్లించారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు అధికారులకు, ఐసీడీఎస్ మంత్రి  వినతి పత్రాలు ఇచ్చినా! నేటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదని అధికారులను అడిగితే ఆర్థిక శాఖ ట్రెజరీలో ఈ నాలుగు వేల మందిని మెయిన్ టీచర్స్ గా గుర్తించినట్లు అప్డేట్ కాలేదని అధికారులు చెప్తున్నారన్నారు. దీంతో ఈ నాలుగు వేల మంది అంగన్వాడీ టీచర్స్ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని. రాష్ట్ర ప్రభుత్వం తమని మెయిన్ టీచర్స్ గా గుర్తించిందా? లేక మోసం చేసిందా? అని అనేక అనుమానాలు వీరిలో వ్యక్తం అవుతున్నాయన్నారు సగం వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక కన్నీరుమున్నీరు అవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, కళావతి, సుజాత, యమున పాల్గొన్నారు.