ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన అంగన్వాడీలు..

నవతెలంగాణ – ఏర్గట్ల

తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్వో మహమ్మద్ యూసుఫ్ కు ఏర్గట్ల మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు బుధవారం వినతిపత్రం అందించారు.అంగన్వాడీల 24 రోజుల సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, శారద, శోభ, శైలజ, పాల్గొన్నారు.