నవతెలంగాణ – జుక్కల్
ఈరోజు కామారెడ్డి జిల్లాలోని ఐదు ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని సెంటర్స్ బంద్ పెట్టి తమ డిమాండ్ల పరిష్కారం కొరకై సీఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి ఐసీడీఎస్ కమిషనర్ ఆఫీస్ ముట్టడించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని దోమకొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. కనీస వేతనం రూ.26 వేల వేతనం పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని, తదితర 20 డిమాండ్ల పరిష్కారానికై హైదరాబాద్ తరలి వెళ్లిడం జర్గింది. ఈ సంధర్భంగా అంగన్వాడీలు భారీ ఎత్తున తరలి వెళ్లారు.