ఢిల్లీలో డెంజర్‌ బెల్స్‌

Danger bells in Delhiప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ అని చెప్పకతప్పదు. ఎందుకంటే దేశ రాజధానిలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 500 దాటింది. గత ఎనిమిదేండ్లుగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులే ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి పెరగడంపై కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌ మెంట్‌ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా, తాజాగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ)-4’ కింద మరిన్ని నిబంధ నలు అమల్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా అన్ని ట్రాన్స్‌పోర్ట్ట్‌్‌ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేయాలని సీఏక్యూఎం ఆదేశిం చింది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌-4 డీజిల్‌ ట్రక్కులను మాత్రమే అనుమతించింది. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షి యల్‌ వెహికిల్స్‌, అలాగే ఢిల్లీ రిజిస్ట్రేషన్‌ తో ఉన్న బీఎస్‌-4 అంతకన్నా పాత డీజిల్‌ రవాణా వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి రాత్రి ఏడు గంటల సమయానికి 457కి పెరగడం గమనార్హం. పరిస్థితిని సమీక్షించిన సీఎం అతిశీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీలోని పాఠశా లల్లో కేవలం ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
చలికాలం వచ్చిందంటే చాలు, ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతోంది. ప్రభుత్వాలు అవలంభిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వం సానికి కారణమవుతున్నాయి. దీనికితోడు మానవ కార్యకలాపాలు, సహజ ప్రక్రియలు ఈ రెండు వాయు కాలుష్యా న్ని సృష్టిస్తున్నాయి. పరిశ్రమలు, రవాణా మొదలైన ప్రజల కార్యకలాపాల ద్వారా తయారైన విష పదార్థాలు సమాజాన్ని చుట్టే గాలిని కలుషితం చేస్తున్నాయి. రుతుపవనాల తిరోగమన అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే , మానవ తప్పిదాలు ఈ వాయు కాలుష్యం స్థాయిలను మరింత పెంచి పీల్చేగాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలు, పరిశ్రమల కాలుష్యం శీతాకాలంలో సహజసిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ప్రజల్ని ఊపిరి పీల్చుకో లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భవన నిర్మాణ పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఏర్పడే దుమ్మూ,ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
ఆక్సిజన్‌, నైట్రోజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, ఆర్గాన్‌తో పాటు నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయం, మానవ అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయువులు, కణాలు, జీవ అణువులతో సహా హానికరమైన లేదా అధిక పరిమాణంలో ఉన్న పదార్థాలను భూమి వాతావరణంలో ప్రవేశపెట్టిన ప్పుడు వాయు కాలుష్యం సంభవిస్తుంది. ఇది మానవులకు వ్యాధులు, అలర్జీలు రావడమే కాదు, చివరికి మరణాలకు కూడా దారితీసే ప్రమాదముంది. ఇది ఆహార పంటలు, జంతువులు, ఇతర జీవులకు కూడా హాని కలిగించవచ్చు. ఇంకా సహజమైన లేదా నిర్మించిన వాతావరణాన్ని కూడా దెబ్బతీస్తుంది. వాయుకాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 80లక్షల మంది మరణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యం లో ప్రజలు ముఖ్యంగా వయోజ నులు, పిల్లల విషయంలో అప్రమ త్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమా దం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది.
– డా.యం.అఖిలమిత్ర,
9949262231