సిమెంట్ రోడ్ల కోసం నిధుల మంజూరు పట్ల హర్షం..

Happy with grant of funds for cement roads..నవతెలంగాణ –  కమ్మర్ పల్లి 
మండలంలోని వివిధ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మురికి కాలువల  నిర్మాణం కోసం రూ.33 లక్షలు మంజూరైనట్లు టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ఆదివారం తెలిపారు.ఈ మేరకు నిధుల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క కు  ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.బాల్కొండ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మండలంలోని పలు గ్రామలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కింద రూ.33లక్షల సీసీ రోడ్లను మంత్రి సీతక్క మంజూరు చేసినట్లు తెలిపారు. తన విన్నపాన్ని ప్రత్యేకమైన దృష్టితో గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ధ్యేయంగా సిమెంటు రోడ్లు మంజూరు చేసిన పేదవారి అభిమాన నాయకురాలు సీతక్కకు  ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కింద మండలంలోని ఉప్లూర్ కు రూ.10 లక్షలు, నర్సాపూర్ కు రూ. 8 లక్షలు, కమ్మర్ పల్లికి రూ. 5లక్షలు, హాస కొత్తూర్ కు రూ. 10లక్షలు మంజూరైనట్లు ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ తెలిపారు.