
నవతెలంగాణ-బెజ్జంకి : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఏఎంసీ డైరెక్టర్ మచ్చ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగాం శంకర్,మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, జెరిపోతుల మధు,ఐలయ్య,కంగండ్ల రాజ మల్లు, బోనగిరి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.