– పన్ను చెల్లింపుల్లో ఎగవేత
– ఫెమా నిబంధనల ఉల్లంఘన
– ఈడీ అధికారుల విచారణ
ముంబయి : రిలయన్స్ ఏడీఏ గ్రూపు అధినేత అనిల్ అంబానీ అక్రమంగా స్విస్ బ్యాంక్‌ల్లో సొమ్ము దాచుకున్నట్టు ఆరోపణలు వస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈడీ అధికారుల ముందు అనిల్ అంబానీ హాజరు కాగా.. మంగళవారం ఆయన సతీమణి భార్య టీనా అంబానీని అధికారులు విచారించారు. విదేశీ మారకపు చట్టాల (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై వారిని ప్రశ్నించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.814 కోట్లు ఉండగా.. వాటికి రూ.420 కోట్లు పన్ను చెల్లించలేదంటూ 2021లో అదాయపు పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ అనిల్ అంబానీ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అనిల్ అంబానీకి ఊరట కల్పిస్తూ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. తాజాగా, ఈ కేసులకు సంబంధించి అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీలు ఇడి విచారణకు హాజరయ్యారు. ఇరువురిని వేరువేరుగా ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఇడి ఆఫీసు బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉన్న ఇడి కార్యాలయం విచారించింది. ఇద్దరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనిల్‌పై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని సమాచారం. ఈ వారంలో మరోమారు వారి ఇరువురు విచారణకు హాజరు కావాలని ఇడి నోటీసులు జారీ చేసింది. 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అనిల్ అంబానీతో పాటు యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్‌లపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో భాగంగా విచారణకు హాజరైన ఆయనను ఇడి ప్రశ్నలు కురిపించగా.. అనిల్ అంబానీ దంపతులపై ఇడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారే వేచి చూడాలి.