నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనిల్‌కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయన రేవంత్‌ను తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎంకు శాలువా కప్పి సత్కరించారు. చిన్న వయసులోనే పెద్దల సభకు వెళ్ళే అవకాశం కల్పించినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంతో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో వారు ఆయన్ను కలిశారు. సీఎంను కలవడంతో వారు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకున్నది.