భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 10న జరగబోయే తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొను యాదాద్రి భువనగిరి జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) మైదానంలో ఉదయం9 గంటలకు జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన . నిర్వహించిన ఈ పోటీలను స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను జెండాఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లా కేంద్రంలో క్రీడాకారుల కొరకు అత్యధిక సౌకర్యాలతో స్టేడియం ఏర్పాటు కోసం మంత్రి వర్యులు మొదటి సంతకం స్టేడియం ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించే విషయంలో చేశారని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి క్రీడలను అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఎంపికకాబడిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. తదుపరి అండర్ 08,10,12,14 మరియు 16 సం// ల బాలబాలికలకు వేరువేరుగా 60మీ.100మీ. 300మీ.400మీ.600మీ. 2000మీ. లాంగ్ జంప్, షాట్ ఫుట్ నందు బాల బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకి మెడల్స్ మరియు మెరిట్ సర్టిఫికెట్స్ అతిథులచే అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అథ్లెట్స్ ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారి వివరాలు అథ్లెట్స్ యొక్క వివరాలు
08 సం. లోపు బాలురు:
50మీ 1. శ్రీరామ్ సూర్య తేజ 2. మర్రి చర్విక్ 3. దయ్యాల నితేష్, 300మీ. 1. రేగు అఖిల్ 2. లావుడియా చరణ్ 3 లోకేష్
10 సం. లోపు బాలురు,100మీ. 1. దీరావత్ శ్రీరామ్2. రౌతుల గుణ శంకర్రావు 3.గుగులోతు హర్షత్, 300మీ. 1. దండే బోయిన రాకేష్ భవాని తేజ ధీరావత్ సాయినాథ్, లాంగ్ జంప్ 1. దండ బోయిన రాకేష్ 2. కొల్లు సాయికుమార్ 3.జస్వంత్
12 సం. లోపు బాలురు:
100మీ.1. దయానమోని జస్వంత్ 2. ఆకుల అనిరుద్ 3.బిల్ల లోకేష్,400మీ 1. బి లోకేష్ 2.అనిరుద్ 3.సాయి
600మీ. 1. గౌస్ కొండ ఈశ్వర్ 2. దూసరి సాయి తేజ3. గుండెబోయిన వర్షిత్, లాంగ్ జంప్ 1.జరపాల విశాల్ 2. దోసకాయల సర్వజ్ఞ 3.రామిడి విష్ణువర్ధన్ రెడ్డి,14 సం. లోపు బాలురు
100మీ. 1. కస్తుల విజ్ఞాన్ 2.మంద లక్ష్మణ్ 3. బొడ్డుపల్లి హరిదీప్,400మీ. 1.మడికొండ గణేష్ 2. కస్తుల విజ్ఞాన్ 3.పవన్ కళ్యాణ్16సం. లోపు బాలురు:
100 మొగ్గు ప్రవీణ్ భానోత్ విశాల్ గురజాల దీక్షిత్
400 1.బానోతు విశాల్ 2.దీక్షిత్ రెడ్డి 3. శ్రీరామ్ నవీన్
600మీ. 1.బోయ రవికుమార్ 2.అండం సంజయ్ రెడ్డి 3.గురజాల దీక్షిత్, అండర్ 08 బాలికలు,50మీ. 1. వడ్డే స్వినికబ్2. ధీరవత్ ఆనంది3. పెగ్గేపురం మాన్విక, 300.మీ. 1. ఎడబోయిన నవ్య శ్రీ 2. బంధనాదం ఎలిసా గ్రేస్ 3. పసల అవంతిక,10 సం. లోపు బాలికలు
100మీ. 1. గుగులోతు వర్షిత 2.చిందింటి జశ్విత 3.ఎండి ముంతాజ్, 300మీ. 1. వంగూరి శృతి 2. సి. జశ్విత 3. గుగులోతు వర్షిత,12 సం. లోపు బాలికలు:
100మీ.1. మునుకుంట్ల ఇందుప్రియ 2. నాగ బండి అక్షిత3. పుల్లూరి సాత్విక, 400 మీ. 1 ఏ తన్వి 2రిత్విక 3. ఉదయశ్రీ, 600మీ. 1. అంకర్ల తన్వి 2.మేకల సంగీత 3. అండే గగన14 సం. లోపు బాలికలు,100మీ. 1. పసల అశ్విత 2. కొత్తపల్లి అర్చన 3.చుక్క అలేఖ్య
16సం. లోపు బాలికలు,100మీ. 1. వాంకుడోత్ వెన్నెల 2.వీర సంజన 3. అల్లం మేరీ అశ్విత,600మీ. 1. వాంకుడోత్ వెన్నెల ఎర్ర సంజన గుగ్గిళ్ళ గ్రీష్మ
ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయబడును అని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గోనూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మాటూరి వినోద్, సంయుక్త కార్యదర్శి, ఆంబోజు అనిల్ కుమార్, ఎర్ర యాదగిరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, సునీల్, మల్లేష్, సతీష్, కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు, రఘువీర్ సింగ్, మహేష్, లావణ్య, శేఖర్, జ్యోతి, అనిత, అజయ్, నవీన్, సాయి, పవన్, సచిన్, రాకేష్, సింధు గణేష్, సాయి, సునీల్, మహేష్, శ్రవణ్ పాల్గొన్నారు.