రంగారెడ్డి జిల్లా యాదవ మహాసభ ఉపాధ్యక్షులుగా ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్

నవతెలంగాణ – మీర్ పేట్
అఖిలభారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ నియామకం అయ్యారు. గురువారం రంగారెడ్డి జిల్లా యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ను రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకొని నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మరిపల్లి అంజయ్య అనిల్ కుమార్ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు సంఘం అభివృద్ధి కోసం శక్తి నుంచి కృషి చేస్తానని అన్నారు. యాదవుల అభ్యున్నతికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందరికీ అందేలా పనిచేస్తానన్నారు. అందరి సహకారంతోనే యాదవుల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గారు కసారమోని మల్లేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు బర్ల జగదీశ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నడికుడి రఘునాథ్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు మేకల కృష్ణ యాదవ్, కమిటీ సభ్యులు దేవన మొని శ్రీనివాస్ యాదవ్, గుమ్మా రామకృష్ణ యాదవ్, చందు యాదవ్, ఎనుగుల శివా యాదవ్, గనేశ్ యాదవ్,  శ్రీనివాస్ యాదవ్,  జక్కుల గోపాల్ యాదవ్, సుధాకర్ యాదవ్ సూదీప్ యాదవ్   తదితరులు పాల్గొన్నారు.