
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి కమ్మర్ పల్లి మండల కేంద్రానికి విచ్చేసిన ఈరవత్రి అనిల్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజారి శేఖర్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు చింత తిరుపతి, సంతోష్ నాయక్, సంపంగి నాగరాజు, ఉప్లూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పోతు మురళి, జిందం హరికుమార్, హాస కొత్తూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు నాయిని పురుషోత్తం, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.