నివాళులర్పించిన బిర్ల అనిత

నవతెలంగాణ – బొమ్మలరామారం 

బొమ్మలరామారం మండలంలోని తూముకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు మేకల సతీష్ లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తాడు. వృత్తిలో భాగంగా ఆదివారం ఉదయం హైదరాబాదులో ఎల్లారెడ్డిగూడెం పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పదవ అంతస్తు నుండి జారిపడి మృతి చెందారు. సోమవారం విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య సతీమణి అనిత అతడి మృతి దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా  కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు.