పార్టీ కి విధేయుడు అంజద్‌ అలీ..

Anjad Ali is loyal to the party.– ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలి: మాజీమంత్రి దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చిన వాటిని తట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ కి అంజాద్ అలీ విదేయుడు గా ఉన్నాడని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. పట్టణ అధ్యక్షులు అంజద్‌ అలీ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక పార్టి ఆఫీస్ లో జరిగిన జన్మదిన వేడుకలో ఆయన కేక్ కట్‌ చేయించి అంజాద్ ఆలీకి స్వీట్‌ తినిపించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అంజాద్ అలీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుని నిండునూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా ఆయన ను స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి అంజాద్ అలీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్‌, బైరు శైలేందర్‌ గౌడ్‌, రాపర్తి శ్రీనివాస్‌ గౌడ్‌, బాలు గౌడ్‌, శనగాని రాంబాబు గౌడ్, రెబల్‌ శ్రీను, మల్లేష్‌ గౌడ్‌, రాంబాబు, మాణిక్యం, సాయినేత తదితరులు పాల్గొన్నారు.