ఆంజనేయులు పార్ధీవ దేహానికి నివాళులు

Anjaneyas are tributes to Pardhiva Dehaనవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేపాకుల ఆంజనేయులు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం ఏకే పౌండేషన్ ఛైర్మెన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కట్టేబోయిన అనిల్ కుమార్ పోతునూరు వెళ్లి ఆంజనేయులు పార్టివదేహానికి నివాళులు అర్పించి కుటుంభ సభ్యులను పరామర్శించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉద్యమ స్ఫూర్తి ని కొనసాగిస్తూ బడుగు  బలహీన వర్గాల అభిన్నతి కి కృషి ఆంజనేయులు ఎంతో కృషి చేశారని అన్నారు.ఆయన మరణం బీసీ సంక్షేమానికి తీరని లోటని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇసురాజు సైదులు యాదవ్, మేకల నాగయ్య యాదవ్, సైదులు గౌడ్, మన్నెం కోటి, బిసి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.