– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ-తొగుట
అప్పుల బాధ తాళలేక మండలంలోని లింగాపూర్ కు చెందిన చెపూరి ఆంజనేయులు గౌడ్ ఆత్మహ త్య చేసుకోవడం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవే దన వ్యక్తం చేశారు. బుధవారం లింగాపూర్ లో ఆయన మృతదేహానికి నివాళి ఆర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ రైతు బీమా ద్వారా రూ.5 లక్షల సహాయం అందుతుందన్నారు. ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో వారి కుటుం బానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరా మర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు తగరం అశోక్, బీఆర్ఎస్ నాయకులు బిక్కనూరి శ్రీశైలం, సంతోష్, జీడిపల్లి స్వామి, సుతారి రాములు, బండారు స్వామి గౌడ్, రాంబాబు తదితరులు ఉన్నారు.