జీపీ బిల్ కలెక్టర్ కు, ఏఎన్ఎం కు సన్మానం

Honor to GP Bill Collector, ANMనవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ బదిలీపై వచ్చిన బిల్ కలెక్టర్ శోభకు, ఏఎన్ఎం అనురాధ కు గ్రామస్థులు గ్రామ పంచాయతీలో సన్మానం శనివారం చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ శోభ నిజామాబాద్ రూరల్ గుండారం గ్రామ పంచాయితీ నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన వెంకటేష్ గౌడ్ పడిన్నతి పై జూనియర్ అసిస్టెంట్ గా గోటగిరి మండలం పోతంగాల్ గ్రామానికి వెళ్లారన్నారు. అనురాధ ఏఎన్ఎం ఆర్మూర్ అర్బన్ నుంచి బదిలీపై వచ్చారు. మాక్లూర్ లో విధులు నిర్వహించిన రాజ్య లక్ష్మి ఆర్మూర్ మండలం అంకాపూర్ బదిలీపై వెళ్లారని తెలిపారు. బదిలీపై మాక్లూ ర్ గ్రామానికి వచ్చిన ఇద్దరినీ గ్రామస్థులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాకేష్, గ్రామ కమిటీ అద్యక్షులు నరేందర్, మాజీ వార్డు సభ్యులు లక్ష్మి నారాయణ, లక్ష్మన్, టీఆర్ఎస్ మాజీ మండల అద్యక్షులు తిరుమల నర్సగౌడ్, దర్గల సాయిలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.