నవతెలంగాణ – మల్హర్ రావు
ఆర్యాణి సకల కళా వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి నృత్య కళా పోటీల్లో ఇటీవల భరత నాట్యంలో గౌతమి నంది అవార్డు అందుకున్న మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన వర్ధమాన నృత్య కళాకారిణి బేబీ బానోత్ అలకనంద రాథోడ్ తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుని జాతీయ స్థాయి నాట్య సౌగంధిక పురస్కార అవార్డుకు ఎంపికైoది. ఈ అవార్డు సెప్టెంబర్ 8న కరీంనగర్ ఫిలిం భవన్ లో జరిగే జాతీయ స్థాయి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డుని అందుకోనున్నట్లుగా తెలిపారు.తమ కూతురికి అవార్డు రావడం పట్ల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు,సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాబోయో రోజుల్లో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని పలువురు ఆకాంక్షించారు.