నవతెలంగాణ మద్నూర్: మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో గురువారం నాడు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న బహు సాటే జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సంధర్బాన్ని పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన చోట అన్న బహు సాటే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రముఖులు మాట్లాడుతూ అన్న బహు సాటే అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆలోచన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. జయంతి ఉత్సవంలో ఉత్సవ కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.