– మంచితనానికి మారుపేరు
– నేడు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
– అల్మాయీపేటలో సభకు ఏర్పాట్లు
నవతెలంగాణ- జోగిపేట
అన్నా అంటే… నేనున్నానంటూ ముందుకు వచ్చే కొంతమంది వ్యక్తుల్లో రవిశంకర్ ఒకరిని చెప్పవచ్చు. అందోల్ మండలం అల్మాయిపేట గ్రామ సర్పంచ్ బాలమణి రవిశంకర్ గత రెండు పర్యాయ లుగా సర్పంచ్ గా ఎన్నికవుతూ వస్తున్నా రు. దీనికి కారణం తన గ్రామంలో ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా … తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటున్నాడు. కాం గ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటూ గ్రామాన్ని కాంగ్రెస్ కంచుకోటగా కాపాడుకుంటూ వస్తున్నారు. గత పది సంవత్సరాలుగా గ్రామంలో తన సేవలను అందిస్తూ గుర్తింపును తెచ్చుకున్నారు. అధికారంలో లేకపోయినప్పటికీని గ్రామంలో అన్ని పార్టీల వారితో కలుపుగోలుగా ఉంటూ అభివద్ధి పనులు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, యువకుడు రాజన్న ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ తీరు కు ఆకర్షితులై ఆదివారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతోపాటు గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరుతున్నారు. గ్రామంలో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించేందు కు సన్నాహాలు చేశారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయ కులతో కలిసి ధనవంతు కషి చేస్తానని రవిశంకర్ నవతెలంగాణకు తెలిపారు.