శ్రీ కుమార్ గణేష్ మండలి వద్ద అన్నదానం

Annadanam at Shri Kumar Ganesh Mandali– అన్నదాత సాయి పటేల్ కుటుంబ పరిహార
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ కుమార్ గణేష్ మండలి వద్ద బుధవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గణేష్ మండలి వద్ద పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నదాతగా సాయి పటేల్ కుటుంబ పరివారం ఆధ్వర్యంలో జరిగింది. పెద్ద మొత్తంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం సాయి పటేల్ కుటుంబ పరివారం ప్రత్యేకంగా శ్రీ కుమార్ గణేష్ మండలి వద్ద పూజలు నిర్వహిస్తూ అన్నదానాన్ని చేపట్టారు. ఇంత పెద్ద మొత్తంలో అన్నదాతగా నిలిచిన సాయి పటేల్ కుటుంబ పరివారానికి భక్తులు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. శ్రీ కుమార్ గణేష్ మండలి అధ్యక్షులు సంతోష్ పటేల్ గణేష్ మండలి సభ్యులు రఘు, బాలు, ఇతర యువకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.