భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో గల స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని భువనగిరి వాసులు ద్యానబోయిన శిరీష ఎల్లయ్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లక్ష్మీనరసింహస్వామి ఉపాసనకులు బత్తిని రాములు స్వామి హాజరై, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రశాంత కేంద్రాలు అని అన్నారు. భక్తి భావంతో సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ని కొల్చిన వారికి వారి కోరికలు స్వామివారి వెంటనే తీరుస్తారని అన్నారు. సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారు శంకు చక్రం, సుదర్శన చక్రాలతో నీలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, వెంకటేష్, భక్తులు బత్తిని కుమార్ గౌడ్, జంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్, బత్తిని వెంకటేష్, తిరుమలేష్, శివ, మహేందర్, జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.