
మండలంలోని మద్దికుంట లోని శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో, పోసానిపేట్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి గంటల దేవస్థానంలో సోమవారం సందర్శకులకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు గోజారి లచ్చిరెడ్డి, బండి పోచయ్య, ఆలయ కమిటీ సభ్యులు నా రెడ్డి మహిపాల్ రెడ్డి, గాండ్ల రవి, బండి శ్రీకాంత్, పోతుల మల్లారెడ్డి, పోతుల చిన్న భాస్కర్ రెడ్డి, సాకలి చింటూ తదితరులు పాల్గొన్నారు.