నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని అబ్బాపూర్ తండాలో బాదావత్ పరివారం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతినెల రెండవ శనివారం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని ఒక్కో పరివారం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాదావత్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్ సింగ్, జగ్గారం, కైలాష్ నాయక్, ఏమ్ల మరియు మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.