అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని రాయి గూడెం గ్రామంలోని ప్రధాన రహదారి చిలుపూర్ రోడ్డు ప్రాంతంలో ఆర్చికి శంకుస్థాపన, శ్రీ సరస్వతి మాత, సోమ లింగేశ్వర ఆలయాలల్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి,స్థానిక ఎంపీ కడియం కావ్య ముఖ్య విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమలింగేశ్వర చారి ఆధ్వర్యంలో నిర్వహించగా విశిష్ట అతిధులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొని మాట్లాడారు.మండలంలోని శ్రీ సరస్వతీ మాత, సోమలింగేశ్వర ఆలయాలు మరో రెండో బాసర గా తీర్చి దిద్దేందుకు సోమలింగేశ్వర చారి తన ఆస్తులను అమ్మి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం గొప్ప శుభ పరిణామం అన్నారు. విద్య ద్వారా వికాసాన్ని సమస్తాన్ని సాధించేందుకు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు అక్షర వ్యాసాన్ని చేపట్టే బృహత్తర కార్యక్రమం నియోజకవర్గంలోని ఈ ప్రాంతాన్ని నెలకొల్పాడం చాలా సంతోషమన్నారు.
చిల్పూరు రోడ్డు నుండి ఈ ప్రాంతం వరకు వారి అభ్యర్థన మేరకు బీటీ రోడ్డు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం సెంట్రల్ లైటింగ్,ఈమాస్ లైటింగ్ సిస్టం,ఔటర్ కెనాల్ సిస్టం తో కెనాల్ కాలువలో నీరు నిలువ ఉండే విధంగా చేయడంతో పాటు పాటు నాలుగు స్నానపు గదులను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. అక్షరాభ్యాసం కోసం వచ్చే భక్త లకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా వారికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని కొందరు దాతల ద్వారా నిర్వహించడం గొప్ప కార్యమన్నారు. అందులో మొట్టమొదటిసారి గా ఈశ్వరయ్య తోపాటు పదిమంది భక్తులు 10 లక్షల రూపాయలను చెల్లించిన వారికి ఈ సందర్భంగా అభినందించారు. వారిలో నేను ఒక భక్తునిగా నా వంతుగా లక్ష రూపాయలను, ఈ ప్రాంతంలో ఉన్న మిల్లర్ల సహకారంతో సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం లో చాలామంది భక్తులు ఉన్నారు. ఇప్పటివరకు మూడున్నర కోట్లతో నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఇంకా మూడు కోట్ల పని ఉందని అందుకు ఈ ఆలయానికి సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో మాది జెడ్పిటిసి పిట్టల శ్రీలత సత్యనారాయణ, మాజీ సర్పంచులు ఎరవెల్లి శరత్, పెసర రమేష్, మొగిలి, మాజీ ఉప సర్పంచ్ మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్,ప్రముఖులు దామోదర్, సంపత్, చంద్రశేఖర్, చిల్పూర్ మండలం మాజీ ఎంపీపీలు, మాది జెడ్పిటిసిలు మాజీ సర్పంచులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.