నవతెలంగాణాముత్తారం: ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలో గల 2వ అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఉప సర్పంచ్ దేవునూరి భానుకుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న పాల్గని చిన్నారులచే అక్షరభ్యాసం, ఆన్న ప్రాసన చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసే బాలా మఅతం, గుడ్లు పంపిణీ చేయాలని, పోషక లోపం కలిగిన చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి, వారి ఎత్తు, బరువు లో మార్పు వచ్చే విధంగా కఅషి చేయాలని, నెల నెల వారి ప్రగతిని పోషణ అప్‌లో నమోదు చేయాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారుల హాజరు, రికార్డుల నిర్వహణ, అంగన్వాడి టీచర్ దుర్గ పని తీరును అమె అభినందించి, సంతఅప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మధుమతి, రజిత, రాజ మల్లమ్మ,గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న, చిన్నారుల తల్లులు, ఎఎన్‌ఎంలు సునీత, సుజాత, సరిత, అంగన్వాడి ఆయాల తో పాటు తదితరులు పాల్గనడం పాల్గన్నారు.