– వైస్ ఛైర్మన్ గా ఆదాసు నాగ రాణి ఏకగ్రీవ ఎన్నిక
– నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ నూతన ఛైర్‌పర్సన్‌గా 8వ వార్డు కౌన్సిలర్ తిరుమలకొండ అన్నపూర్ణ,వైస్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చైర్పర్సన్,వైస్ చైర్మైన్ గా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాస్ అందజేశారు. నందికొండ మున్సిపల్ చైర్మన్ అనూష రెడ్డి,వైస్ చైర్మన్ మంద రఘువీర్ పై ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 11గంటలకు నూతన చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రత్యేక సమావేశం ద్వారా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రారంభించారు.ఈ సమావేశంలో 8 మంది కోరం సభ్యులు ఈర్ల రామకృష్ణ,మోహన్ రావు,మంగత నాయక్,రమేష్ జి,శిరీష మోహన్ నాయక్,శ్వేతా రెడ్డి సమావేశానికి హాజరయ్యారు.అనంతరం నూతన చైర్మన్,వైస్ చైర్మన్ గా ఎన్నికైన అన్నపూర్ణ,ఆదాసు నాగ రాణి ని కాంగ్రెస్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి మరియు కాంగ్రెస్ శ్రేణులు పులబొకేలు అందించి ఘనంగా సన్మానించడం జరిగింది.
ప్రజా సేవకోసం నిరంతరం శ్రమిస్తా…నూతన ఛైర్మన్ అన్నపూర్ణ: ప్రజలసేవ కోసం నిరంతరం శ్రమిస్తానని నందికొండ మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ అన్నారు. తనపై నమ్మకంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మాజీ మంత్రి జానారెడ్డి,ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగా రెడ్డి తో పాటు ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజా సంక్షేమానికి తనవంతు ఎప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.