బాలికల అండర్ -14 ఖో ఖో క్రీడల్లో ఎంపికైన అన్నారం పాఠశాల ఆణిముత్యాలు

నవతెలంగాణ- తుంగతుర్తి: బాలికల అండర్ -14 ఖో ఖో క్రీడల్లో అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినిలు వీరబోయిన మౌనిక, ఉప్పుల సింధు లు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 7న సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 బాలికల ఖో ఖో పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపికైన మౌనిక, సింధులతో పాటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రియాజ్ లను గ్రామ సర్పంచ్ మిట్టగడుపుల అనోక్, ఎంపీటీసీ వంటల కృష్ణ, పాఠశాల చైర్మన్ లింగమల్లు, ప్రధానోపాధ్యాయులు గురువయ్య, ఉపాధ్యాయ బృందం బింగి లక్ష్మయ్య, నరేందర్, దేవేందర్, సోమయ్య, పద్మ, లక్ష్మయ్య తదితరులు ఘనంగా సన్మానించారు.