
కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కెసిఆర్ పోటీ చేస్తుండడంతో మండలంలోని అన్నారం యాదవ సంఘం సభ్యులు 62 మంది కెసిఆర్ కు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ అభివృద్ధిని చూసి కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయంటే, కెసిఆర్ ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాచారెడ్డి ఎంపిపి నర్సింగరావు, మండల నాయకులు చిన్న రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్, కూడెల్లి బాలరాజు, కుక్కల రాజయ్య, కుమ్మరి మురళి తదితరులు ఉన్నారు.