అంగన్ వాడి కేంద్రంలో వార్షికోత్సవం

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా అంగన్ వాడిల మండల సూపర్ వైజర్ సరస్వతి తెలిపారు. చిన్నారులు చేసిన ఆటపాటలు పలువురుని అలరించాయి. మూడేళ్ళు దాటిన చిన్నారులను అంగన్ వాడి కేంద్రాల్లో చేర్పిస్తే వారికి పోషకారంతోపాటు, ఆటపాటలు నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.