అంగరంగ వైభవంగా అమ్మవారి వార్షికోత్సవం..

నవతెలంగాణ – ధర్మసాగర్ 
మండలంలోని రాయగూడెం గ్రామంలో గల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ 6వ వార్షికోత్సవం  రామగిరి సోమాచార్యులు, సోమలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వతపస్వి  అష్టావధాని నరసింహాచార్యులు విచ్చేసి మాట్లాడుతూ.. భారతదేశంలో గల పుణ్యక్షేత్రాలలో అతి ప్రాముఖ్యమైన క్షేత్రాలలో జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం ముఖ్యమైనదని, తెలంగాణలో బాసర పుణ్యక్షేత్రం తర్వాత ధర్మసాగర్ మండలంలోని రాయగూడెంలో గల  శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం పేరుగాంచిందని తెలిపారు. ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి రామగిరి సోమాచార్యులు సోమలక్ష్మి దంపతులకు అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా ఉన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు అవ్వాలని కోరారు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రధాన అర్చకులు ఎర్రోజు వీరన్న చారి మాట్లాడుతూ.. ఆలయంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసం,నామకరణం,ఉపనయనం కార్యక్రమాలు జరుగునని ప్రతినెల మూలా నక్షత్రం ప్రాతకాలమున అమ్మవారికి అభిషేకం జరుగుతుందని అన్నారు.భక్తులు భక్తి శ్రద్ధాశక్తులతో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రులు అవ్వాలని కోరారు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపానగల శ్రీ సోమ లింగేశ్వర స్వామి ఆలయం మూడు నెలల క్రిందట ప్రారంభమైందని తెలిపారు. ప్రధాన అర్చకులు కేసోజు రామ బ్రహ్మచార్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం అభిషేకం జరుగుతుందని జిల్లాలో వివిధ గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామి దర్శనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని అందరికీ స్వామివారి కృపా కటాక్షాలు అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఉపాసకులు బ్రహ్మశ్రీ నరసింగోజు బ్రహ్మచార్యులు, పుణ్య దంపతులు పుష్పక్ భవ్య శ్రీ, భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.