
చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో సాయి యాదాద్రి వృద్ధాశ్రమం నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.శనివారం సాయి యాదాద్రి వృద్ధాశ్రమం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు,నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం ఫౌండర్ మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి జానకమ్మ దంపతులు పెద్ద కొండూరులో తన సొంత డబ్బులతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇటువంటి నిరాశ స్పృహలు ఎందరో ఉన్నారని నా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలని తలంపుతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. చౌటుప్పల్ మండల ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులకు ప్రమాద బీమా పత్రాలు అందజేశారు. అనంతరం ఆశ్రమానికి విరాళాలు అందజేస్తున్న ప్రముఖులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు దెబ్బడి అశోక్,జే.వై శెట్టి,విద్యాసాగర్ రెడ్డి,ఎస్.మహేష్, ఎన్.రాజేంద్రప్రసాద్,ఎన్.శశాంక కుమార్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.