లోక్‌సభ స్థానాల బీజేపీ ఇన్‌చార్జుల ప్రకటన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్‌చార్జులుగా నియమితులైన వారిలో ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌ (ఆదిలాబాద్‌), రామారావు పవార్‌(పెద్దపల్లి), ధన్‌పాల్‌ సూర్యనారయణ గుప్తా (కరీంనగర్‌), ఆలేటి మహేశ్వర్‌రెడ్డి (నిజామాబాద్‌), కె.వెంకట రమణారెడ్డి రెడ్డి(జహీరాబాద్‌), పాల్వాయి హరీశ్‌బాబు (మెదక్‌), పైడి రాకేశ్‌రెడ్డి(మల్కాజిగిరి), టి.రాజాసింగ్‌(హైదరాబాద్‌), ఎంపీ, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌(సికింద్రాబాద్‌), ఎమ్మెల్సీ ఎ.వెంకటనారాయణరెడ్డి(చేవెళ్ల), మాజీ ఎమ్మెల్సీలు ఎన్‌.రామచంద్రరావు(మహబూబ్‌నగర్‌), మారం రంగారెడ్డి(నాగర్‌ కర్నూల్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి(ఖమ్మం), మాజీ ఎంపీ గరికెపాటి మోహన్‌రావు(మహబూబాబాద్‌), మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి (వరంగల్‌), మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి(నల్లగొండ), ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌(భువనగిరి) ఉన్నారు.