
అంగన్ వాడీ ఉద్యోగులను ప్రభూత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ అన్నారు. బుదువారం నాడు అంగన్ వాడి టీచర్ల సమస్యలపైన జుక్కల్ తహసీల్దార్ గంగాసాగర్ మండలంలోని అంగన్ వాడి టీచర్లతో కలిసి వినతిపత్రం అందించారు. సందర్భంగా సురేష్ గొండ మాట్లాడుతు అంగన్ వాడి టీచర్లకు ప్రభూత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఇరువై ఆరు వేల వేతనాలు ఇవ్వాలని పలు డిమాండ్లతో కూడినవి, డిమాండ్లను ఈనెల పదవ తేది వరకు చేయాలని, లేకుంటే పదకోండవ తేది నుండి నిరవదిక సమ్మే చేస్తామని వినతి పత్రం తహసీల్దార్ కు అందించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ , మరియు పెద్ద ఎడ్గి సెక్టార్ అంగన్ వాడి టీచర్లు సుమలత, లక్ష్మీ , అనితా, చంద్రకళ, అంబవ్వ, కంశవ్య, హన్మవ్య, సాయవ్వ, లతా, మండలంలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాల టీచర్లు తదితరులు పాల్గోన్నారు.