గంగ నీళ్లతో గ్రామదేవతలకు అభిషేకాలు..

Abhishekam to village deities with Ganga water..నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని సర్వసమజ్ , ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు శనివారం రాత్రి పోచంపాడ్ లోని గోదావరి నదికి చేరుకొని గంగా స్నానం ఆచరించి గంగాజలాలు తీసుకువచ్చారు. సంఘ సభ్యులు డప్పు వాయిద్యా లతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి కార్యదర్శి కర్తన్ దినేష్, చెపూర్ ధనుంజయ్, లక్కాకుల రంజిత్,నర్మే గంగారెడ్డి, దొండీ శ్యామ్, చక్రీ, భూమన్న, సదర్లు గుండేటి మహేష్, డి. రాజు, చిట్టి శ్రీనివాస్, సిద్దాపురం లింగన్న, దొడ్ల గోపాల్, నల్ల లింగన్న తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు మండల కేంద్రంలో…. వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా గంగనీళ్ల అభిషేకం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, సమృద్ధి కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ అభిషేకాన్ని చేపడుతున్నట్లు వీడీసీ అధ్యక్షులు బార్ల ముత్యం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పంటలు విస్తారంగా పండాలని, గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు తిర్మన్ పల్లి నవనీత్, కేశపల్లి గంగారెడ్డి, సుమన్, జాన్, అశోక్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ లో… పట్టణంలోని కోటార్మూర్ లో విడీసీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం గ్రామదేవతలకు గంగ నీళ్ల కార్యక్రమంలో భాగంలో ముఖ్య అతిథి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి హాజరై పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, డైరెక్టర్ మామిడ శేఖర్ రెడ్డి , ,5వ వార్డు మాజీ కౌన్సిలర్ శాల ప్రసాద్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.