మరో 1,827 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ

– ఆర్థికశాఖ అనుమతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని టీచింగ్‌ ఆస్పత్రుల్లో 1,827 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిన ఈ పోస్టులు భర్తీ చేస్తుంది. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 5,204 స్టాఫ్‌ నర్సుల నియామక ప్రక్రియను వైద్యారోగ్య శాఖ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.