
గాంధారి మండలంలోని చద్మల్ తండా గ్రామ పంచాయతీలో సంక్రాంతి సందర్భంగా జరిగే లక్ష్మమ్మ జాతర సందర్భంగా నకిలీ నోట్ల కేసులో దొరికిన ఏడుగురు నేరస్థులను ఈనెల 24న జ్యూడిషల్ రిమాండ్ పంపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులలో ఒకడైన మారుసుకోల తిరుపతి అలియాస్ రాజును అన్నారం గ్రామము మంచిర్యాల జిల్లా నందు పట్టుకొని విచారించారు. ఈ నేపథ్యంలో అతను చేసిన నేరం ఒప్పుకున్నాడు. దీంతో నేడు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు. మరో నిందితుడైన జగన్ పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటామని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ , గాంధారి ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.