అనారోగ్యంతో బీజేపీ నాయకుడు మరో వ్యక్తి మృతి

Ramagiriనవతెలంగాణ-రామగిరి
రామగిరి మండల బీజేపీ సీనియర్ నాయకుడు సమ్మెట రాము (35) కరీంనగర్ లోని ఆసుపత్రిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయన మృతి పట్ల బీజేపీ మండల సీనియర్ నాయకులు ములుమూరి శ్రీనివాస్ అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా మండలంలోని ఆదివారం పేట గ్రామానికి చెందిన మంథని రాజేందర్ (52) అనారోగ్యాంతో మృతి చెందారు. మంథని రాజేందర్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్, తాజా మాజీ గ్రామ సర్పంచ్ మైదం కుమార్, మాజీ ఎంపీటీసీ కన్నూరి నర్సింగరావు, మైదం నాగేశ్వర్, అట్టే తిరుపతిరెడ్డి, ఎలువాక సునీల్ వదిన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.