నవతెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్.. ఒప్పో ఏ38 (Oppo A38) ఫోన్ శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో చిప్ సెట్, 33 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో ఆవిష్కరించిన ఈ ఫోన్ సింగిల్ స్టోరేజీ ఆప్షన్, రెండు రంగుల వేరియంట్లలో లభిస్తుంది. ఒప్పో ఏ38 ఫోన్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఒప్పో ఏ38 ఫోన్ (Oppo A38) గ్లోవింగ్ బ్లాక్, గ్లోవింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఉంటుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,999లకే లభిస్తుంది. ఈ నెల 13 నుంచి అధికారిక ఒప్పో వెబ్ సైట్ తోపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఒప్పో ఏ38 ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ + (1612×720 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 720 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్‌పై ఫోన్ పని చేస్తుంది. ఒప్పో ఏ38 (Oppo A38) ఫోన్ 50-మెగా పిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కలిగి ఉంటుంది. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. వై-ఫై 5.3, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ-పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ కూడా జత చేశారు.