యూపీ స్కూల్‌ పేపర్‌లో మరో వివాదాస్పద ప్రశ్న

న్యూఢిల్లీ: బీజేపీ పాలిత యూపీలోని మరో పాఠశాలలో ప్రశ్నాపత్రం వివాదస్పదంగా మారింది. బహరైచ్‌ పట్టణంలోని 9వ తరగతి హిందీ పేపర్‌లో ”భారత ముస్లిం తీవ్రవాదం”పై ప్రశ్న రావటం చర్చనీయాంశంగా మారింది. ఇది స్థానికంగా ముస్లింలలో ఆందోళనను రేపింది. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు నిరసన తెలిపారు. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం స్పందించింది. ప్రశ్నపత్రం సిద్ధం చేసిన హిందీ ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం తొలగించి పరీక్షను రద్దు చేసింది.