మరో కల్ట్‌ లవ్‌స్టోరీ మొదలైంది

మరో కల్ట్‌ లవ్‌స్టోరీ మొదలైందిడైరెక్టర్‌ త్రినాధ రావు తన బ్యానర్‌ నక్కిన నేరేటివ్స్‌లో ప్రొడక్షన్‌ నెం 2ను అనౌన్స్‌ చేశారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి హీరోగా నటిస్తుండగా, వంశీ కష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. సురేష్‌ సహ నిర్మాత. ఈ సినిమా బుధవారం గ్రాండ్‌గా లాంచింగ్‌ వేడుకను జరుపుకుంది. త్రినాథరావు,నాయుడు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్‌కు సందీప్‌ కిషన్‌ క్లాప్‌ కొట్టగా, శరత్‌ మరార్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. సుమంత్‌ తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి సరసన హీరోయిన్‌గా ‘దశ్యం’ చిత్రంలో వెంకటేష్‌ కుమార్తెగా కనిపించిన ఎస్తేర్‌ అనిల్‌ నటిస్తుండగా, తారక్‌ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ,’ఇది కల్ట్‌ లవ్‌స్టొరీ. టౌన్‌లో జరిగే అందమైన ప్రేమకథ. ఇందులో విలన్‌ పాత్ర కూడా చాలా కీలకమైనది. కథ అద్భుతంగా వచ్చింది. నాతో పాటు నరేష్‌, ఉదరు భాగవతుల స్క్రీన్‌ ప్లేలో, నరేష్‌, రాజేంద్ర ప్రసాద్‌ డైలాగ్స్‌లో పని చేశారు. దర్శకుడు వంశీ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో విక్రమ్‌ పాత్ర అదిరిపోతుంది. విక్రమ్‌కి జోడిగా ఎస్తర్‌ చేస్తున్నారు’ అని తెలిపారు.