అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

Another firefight in America– ముగ్గురి మృతి
జాక్సన్‌విల్లె: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లెలో ఉన్న డాలర్‌ జనరల్‌ స్టోర్‌ వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. వీరంతా నల్లజాతీయులే. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.. సాయుధ దుండగుడు స్టోర్‌లోకి చొరబడ్డాడు. కాల్పుల సమయంలో అతడికీ తీవ్ర గాయాలు కావడంతో మరణించాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఏఆర్‌-15 స్టైల్‌ రైఫిల్‌తోపాటు మరో హ్యాండ్‌గన్‌తో స్టోర్‌ వద్దకు వచ్చిన సాయుధ దుండగుడు కాల్పులకు తెగించాడు. జాత్యాహంకారంతోనే దుండగుడు వారిపై కాల్పులు జరిపినట్లు జాక్సన్‌విల్లె పోలీసులు వెల్లడించారు.