మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. సూర్యదేవర రాధాకష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మొదటి టీజర్ వైరల్‌గా మారగా, ‘ధమ్ మసాలా’ సాంగ్.. తెలుగు ఆల్బమ్‌లలో టాప్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. లేటెస్ట్‌గా మేకర్స్ మెలోడియస్ సౌండ్‌ట్రాక్ ‘ఓ మై బేబీ’ని రెండవ గీతంగా రిలీజ్ చేశారు. ఈ మెలోడీ గీతానికి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుందని సంగీత దర్శకుడు తమన్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-తమన్ కలయికల్లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు ఈసినిమా కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ‘ధమ్ మసాలా’ బాటలోనే ‘ఓ మై బేబీ’ పాట కూడా భారీ చార్ట్‌బస్టర్‌గా మారనుంది. ఈ మెలోడీని శిల్పారావు పాడగా, ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ పాట శ్రోతలను కట్టిపడేస్తోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రమ్యకష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిసున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.