రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

Another huge investment for the state– రూ.800కోట్లతో తన కార్యకలాపాలను
– విస్తరించనున్న మార్స్‌ గ్రూప్‌ సంస్థ
– పెట్స్‌ ఆహార ఉత్పత్తుల్లో ప్రసిద్ధి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రానికి తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్‌) తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్‌ గ్రూప్‌ తెలంగాణలో అదనంగా మరో ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్‌తో మార్స్‌ సంస్థ చీఫ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌ ఆఫీసర్‌ శేఖర్‌ కష్ణమూర్తి బందం శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సంస్థ తన విస్తరణ ప్రణాళికలను, నూతన పెట్టుబడి గురించిన వివరాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బందం తెలంగాణ రాష్ట్రంలో తమ పెట్టుబడి, కార్యకలాపాల అనుభవాలను వివరించి సంతప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే తమ సంస్థ సిద్దిపేటలో ఉన్న పెంపుడు జంతువుల (పెట్స్‌) ఫుడ్‌ తయారీ ప్లాంట్‌ ద్వారా పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. తొలుత కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో సంస్థ సిద్దిపేటలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మార్స్‌ సంస్థ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని ఇందులో భాగంగా రూ.500కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది. ఒప్పందం మేరకు రూ.500 కోట్ల పెట్టుబడిని పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల అనుభవాలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణం, ప్రభుత్వ విధానాల వంటి అనేక సానుకూల కారణాల వలన తాజాగా మరో రూ.800 కోట్ల పెట్టుబడి విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.
భారతదేశంలో తమ సంస్థ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తుందని పెట్‌ కేర్‌, పెట్‌ ఆహార ఉత్పత్తుల డిమాండ్‌ మరింత పెరుగుతుందన్న ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ కేంద్రంగా సంస్థలు మరింతగా విస్తరించనున్నట్టు తెలిపింది. కేవలం ఉత్పత్తి తయారీ ప్లాంట్‌ విస్తరణ మాత్రమే కాకుండా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫÛర్మేషన్‌, అగ్రికల్చర్‌ సప్లైచైన్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాల్లోనూ తమ విస్తరణకు ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్‌తో జరిగిన ఈ సమావేశంలో కష్ణమూర్తి బందం విస్తతంగా చర్చించింది. ఇప్పటికే సిద్దిపేటలో తయారీ ప్లాంట్‌ ఉన్న మార్స్‌ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టి మరింతగా విస్తరిస్తుండటం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త కంపెనీల పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమైన అంశంగా భావిస్తామో, ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు కూడా తిరిగి తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్నది తమ ఆలోచనగా ఉన్నదని తెలిపారు . ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక కంపెనీలు పెద్ద ఎత్తున తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుతున్నాయని, తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు. ఒక కంపెనీ తాను కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో తిరిగి పెట్టుబడులు పెట్టడం అంటే ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సూచిక అని తెలిపారు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి తమ సంస్థను విస్తరిస్తున్న మార్స్‌ గ్రూప్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ ప్రస్థానం నేటి రూ.800కోట్ల విస్తరణ ప్రణాళికలతో రూ.1500 కోట్ల స్థాయికి చేరిందని, ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతను వివరిస్తుందన్నారు. భవిష్యత్తులోనూ సంస్థ మరింతగా తెలంగాణ కేంద్రంగా విస్తరిస్తున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఓమ్నికాం గ్రూప్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌
అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రఖ్యాత ఓమ్నికాం గ్రూప్‌ హైదరాబాద్‌ నగరంలో తన గ్లోబల్‌ క్యాపిటల్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ న్యూయార్క్‌ నగరంలో ఓమ్నికాం సీనియర్‌ ప్రతినిధి బందంతో సమావేశమయ్యారు. సంస్థ తన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయాలని ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. మే నెలలో సంస్థతో జరిగిన ప్రాథమిక చర్చల్లో ఈ కేంద్రం ఏర్పాటు కోసం కంపెనీకి విజ్ఞప్తి చేశామన్నారు. హైదరాబాద్‌ నగరంలో మీడియా అనుబంధ రంగాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరుల నైపుణ్యాన్ని, మౌలిక వసతుల అంశాన్ని వివరించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతోపాటు కంపెనీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపామని, మీడియా అనుబంధ రంగాల్లో ఇన్నోవేషన్‌, వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ దిశగా ఓమ్నికాం సంస్థ ప్రకటన ఎంతగానో దోహదం చేస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 2500 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, ఇది తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు.
భారతదేశంలో పాటు అంతర్జాతీయంగా అనేక ఇతర నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు సంస్థ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జైద్‌ ఆల్‌ రషీద్‌ తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాలు 100 దేశాల్లో కొనసాగుతున్నాయని, ఇదే దిశగా భారత దేశంలోనూ తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు సహకరిస్తుందన్నారు. ఈ కేంద్రం కార్యకలాపాల ద్వారా తమ సంస్థ మీడియా రంగంలో లక్ష్యాలకు అనుగుణంగా అనుకున్న వృద్ధిని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మే నెల నుంచి నిరంతరం తెలంగాణ ప్రభుత్వంలోని స్వయంగా మంత్రి కార్యాలయం నుంచి ఈ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు కోసం చర్చలు కొనసాగాయని తెలిపారు. తమ సంస్థ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:47):

ra5 is low blood sugar serious | what is blood sugar level E5K for diabetes type 2 | can advil 8jl affect blood sugar levels | cinnamon extract to lower blood CHo sugar | will an apple 1oI raise your blood sugar | foods that lower blood sugar zD9 during pregnancy | what a normal 38E number for blood sugar | does not eating make your blood sugar RqV high | is 116 5Sd a normal blood sugar level | does decaffeinated coffee 1DG raise your blood sugar | supplements for lowering py6 blood sugar | does tea raise tdL blood sugar | berberine Fsm for blood sugar | what to eat to keep blood amE sugar up | type 2 uhJ diabetes blood sugar levels before bed | blood sugar P9x levels 150 | how does insulin change blood sugar levels sGN | how to ilc yse essential oils for blood sugar | blood PVv pressure blood sugar monitor | does 6yP being cold make your blood sugar drop | best Nqb times to get blood sugar | blood 2i7 sugar chart calculator | how to get l7e your blood sugar to go down | how to naturally P9B raise low blood sugar | Yi9 things to eat when blood sugar is low | does ativan F2k cause high blood sugar | borderline sugar level in xcU blood | does symlin lower 3Ym blood sugar | can dextrose raise your blood GUA sugar | blood sugar drops haur and a half jRb after breakfast | keep 1Hx a eye on blood sugar | what is the typical fasting blood M2Y sugar | fasting blood vEv sugar for prediabetes | DYO fasting blood sugar and postprandial blood sugar | best low carb lunch to keep blood kPg sugar down | OTG how to lower your blood sugar without medicine | blood sugar nJS level for pregnant mother | can thyroid levels affect blood sugar znO | can granola dHl raise blood sugar | blood sugar levels rOb low infant | can oOv your blood sugar get too low on ozempic | RdB how to determine blood sugar level h1ac levels | best rVi way to reduce blood sugar level | 260 mg QHK blood sugar level | does creatine lower blood sugar 3Fu | elevated Rlu blood sugar after surgery | will hibiscus FW3 tea help lower blood sugar | food can cause blood sugar rise study DSD | fasting blood Ul9 sugar interpretation | WF9 does milo increase blood sugar